వైసీపీలో చేరిన టిడిపి సీనియర్ నాయకుడు

UPDATED 15th MARCH 2020 SUNDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి) ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు సమక్షంలో ఆయన చేరారు. ఈ సందర్భంగా దొరబాబు ఆయనకు పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం స్థానిక విలేఖరులతో రాజబ్బాయి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించానని, సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీకి తన వంతు సేవలు అందించినా తనకు సముచిత స్థానం కల్పించలేదని ఆయన పేర్కొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us