UPDATED 9th MAY 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక వై.ఆర్.ఎల్ డిగ్రీ కళాశాలలో ఇండియన్ హెల్త్ కేర్ కంపెనీ బుధవారం నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 35 మంది అభ్యర్థులు ఎంపికనట్లు కళాశాల డైరెక్టర్ వై. రవిచంద్ తెలిపారు. ఈ ఎంపికలకు ఎనభై మంది విద్యార్థినీ, విద్యార్ధులు హాజరుకాగా రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు అనంతరం ముప్పై అయిదు మంది అభ్యర్థులు ఎంపికైనట్లు సంస్థ ప్రతినిధులు శ్రీధర్, మరియన్ తెలియజేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. లక్షా ఎనభై వేలు వేతనంతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తామని తెలియజేశారు. ఎంపికైన అభ్యర్థులను కళాశాల డైరెక్టర్ వై. రవిచంద్ర, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎ. దుర్గాప్రసాద్, అధ్యాపక బృందం, తదితరులు అభినందించారు.







