UPDATED 30th NOVEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక స్టేషన్ సెంటర్లో వేంచేసియున్న నూకాలమ్మ ఆలయంలో అమ్మవారికి శనివారం రాత్రి లక్ష చామంతి పూల పూజ ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయ ప్రధానార్చకులు సాయికుమార్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త వల్లూరి బుల్లియ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మహిళా భక్త సంఘం ఆధ్వర్యంలో పారాయణాలు నిర్వహించారు. పూజలు అనంతరం భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు.







