మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

UPDATED 10th MARCH 2020 TUESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని అన్నారు. నామినేషన్లు స్వీకరణకు ప్రతీ నాలుగు వార్డులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేశామని, 14వ తేదీన నామినేషన్ల పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. 23వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ బ్యాలెట్ విధానంలో జరుగుతుందని, 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విషయాలను ఓటర్లు, అభ్యర్థులు, పార్టీ నాయకులు గమనించాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ డీఈ సిహెచ్ రామారావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us