వ్యక్తిత్వ వికాస శిక్షణతో పరీక్షల్లో మెరుగైన ఫలితాలు

UPDATED 13th FEBRUARY 2019 WEDNESDAY 8:00 PM

పెద్దాపురం: వ్యక్తిత్వ వికాస శిక్షణా సదస్సు ద్వారా విద్యార్థులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని రాష్ట్ర  ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూలు ఆవరణలో నియోజకవర్గ పరిధిలో గల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు పదవ తరగతిలో పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యక్తిత్వ వికాస శిక్షణా సదస్సు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ప్రతీ విద్యార్థి ఒత్తిడిని అధిగమించి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా చదువుకుని పరీక్షలలో నూరుశాతం మార్కులు సాధించాలని అన్నారు. ఈ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న గంపా నాగేశ్వరరావు విద్యార్థులకు మంచి సందేశాలనిచ్చి విద్యార్థులలో భయాన్ని పోగొట్టే మంచి వక్తని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యారంగాన్ని మరింత మెరుగుపర్చడానికి ప్రైవేటు పాఠశాలలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రశ్నాపత్రాన్ని బాగా చదువుకుని మొదటిగా బాగా వచ్చిన ప్రశ్నకు జవాబు వ్రాసి, రాని ప్రశ్నకు చివరిలో సమాధానాలు వ్రాయాలని, అలాగే చేతివ్రాత గుండ్రంగా ఉంటే మరింత మెరుగైన మార్కులు పొందవచ్చని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్ లో సాంకేతిక విద్యకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, మెరిట్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు పొందవచ్చని ఈ విషయాన్ని ప్రతీ విద్యార్థి దృష్టిలో పెట్టుకుని విద్యను అభ్యసించాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఎటువంటి సిఫార్సులు లేకుండా పోటీ పరీక్షలలో విజయం సాధించిన వారికి మాత్రమే ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిమ్మకాయల రంగనాగ్, పవన్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ డైరెక్టర్ సిహెచ్ విజయప్రకాష్, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజులను మంత్రి అభినందించారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ విద్యావికాశం అందించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తిత్వ వికాసంపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేశారని, విద్యార్థులు ఈ సదస్సులు ద్వారా ప్రథమస్థానంలో ఉత్తీర్ణులు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముందు నిమ్మకాయల రంగనాగ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం నార్త్ జోన్ క్రికెట్ పోటీలలో ఛాంపియన్స్ గా నిలిచిన శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూలు విద్యార్థులను మంత్రి అభినందించారు. అనంతరం శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూలు డైరెక్టర్  విజయప్రకాష్ మంత్రికి, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజులకు వారి చిత్రపటాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చిన గంపానాగేశ్వరరావు, మహారాణి సత్రం చైర్మన్ తూతిక రాజు, డివైఎం సుభద్ర, సామర్లకోట, పెద్దాపురం ఎంఇవోలు వై.వి.శివరామకృష్ణయ్య, ఎంవి దుర్గాప్రసాద్, సామర్లకోట ఎంపిడివో కె. స్వప్న, కొత్తెం కోటి, గుమ్మళ్ళ రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us