అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

UPDAED 15th AUGUST 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని ప్రిన్సిపాల్ ఐ. శారద అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 72వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా బుధవారం కళాశాలలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శారద మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం ఎందరో మహనీయుల త్యాగఫలమని, దేశాభివృద్ధికి విద్యార్థుల ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. దేశం సాంకేతికంగా ఎదగాలని, అందుకు తగ్గట్లుగా విద్యార్థులు తమ జీవితాలను మలుచుకోవాలని సూచించారు. కుల, మత, వర్గ భేదాలు లేని సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత విద్యార్థులదేనన్నారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించగా మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి క్యాడెట్లు, కేర్ టేకర్ జి. పెద్ద, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.  
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us