కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చెయ్యాలి

UPDATED 13th MARCH 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట పంచాయతీ కాంట్రాక్టు కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, గ్రామ కార్యదర్శుల పోస్టుల భర్తీలో అర్హులైన గ్రామ పంచాయతీ కార్మికులకు ముప్పై శాతం పోస్టులు కేటాయించాలని, అలాగే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి కానీ అందుకు మూలమైన గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడంలో మాత్రం విఫలమవుతున్నారని ధ్వజమెత్తారు. అర్హులైన కార్మికులకు పంచాయతీలలో ఖాళీ అయిన గుమస్తా, బిల్లు కలెక్టర్, వాచ్ మెన్, అటెండర్ పోస్టుల్లో అర్హతను బట్టి భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు బి. శ్రీనివాసు, మండల ప్రధాన కార్యదర్శి, వై. శివశంకర్, అధ్యక్షుడు ఎం. సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఎం. వెంకటేశ్వరరావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us