గంగవరం(రెడ్ బీ న్యూస్):
గంగవరం మండల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటీఎఫ్ ఆధ్వర్యంలో పోలీస్, గ్రామ సచివాలయ సిబ్బంది, పాత్రికేయలకు మాస్కులు, శానిటైజర్లు,పళ్లు
మొదలయినవాటిని రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం పంపిణీ చేశారు.అలాగే పలు లోతట్టు ప్రాంతాల్లో గిరిజనులకు కూరగాయలు, పళ్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నట్లు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కృష్ణ తెలిపారు. అలాగే మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమకూర్చిన సుమారు రూ. 50 వేలతో కూరగాయలు మాస్కులు శానిటైజర్లు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. లోతట్టు గిరిజన ప్రాంతాల్లో వారపు సంతలు జరగకపోవడంతో నిత్యవసర వస్తువులు సక్రమంగా దొరకని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా తమ వంతు సహాయ సహకారాలను అందించాలన్న ఉద్దేశంతో ఈపంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈపంపిణీ కార్యక్రమంలో తహశీల్దార్ ఎం. వీర్రాజు, ఎస్ఐ షరీఫ్, రెవెన్యూ ఇనస్పెక్టర్ జిలాని, యుటిఎఫ్ నాయకులు వెంకన్న దొర, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







