UPDATED 23rd APRIL 2018 MONDAY 8:00 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కె.ఎల్.ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రి చైర్ పర్సన్ కె. నాగమణి లేడీ లెజెండ్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ ఆవార్డును అందుకున్నట్లు కళాశాల కార్యదర్శి కె. మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లోని ట్యూటర్స్ ఫ్రెడ్ విభాగం ఈ నెల 22న ఈ అవార్డును మాజీ కేంద్ర మంత్రి టి. సుబ్బిరామిరెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారని, మహిళలు వారు ఎంచుకున్న రంగంలో సాధిస్తున్న ప్రగతి ఆధారంగా ఈ అవార్డు బహూకరిస్తారని అన్నారు. ఈ అవార్డు అందుకున్న చైర్ పర్సన్ ను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు అభినందనలు తెలియచేశారు.







