UPDATED 15th FEBRUARY 2019 FRIDAY 7:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో సెమినార్ ఆన్ 4 స్టార్ట్ అప్స్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ఎంటర్ ప్రెన్యూర్ విభాగంలో విద్యార్థులు రాణించినపుడే దేశాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, రోజురోజుకూ పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి.హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.







