UPDATED 3rd JULY 2019 WEDNESDAY 6:30 PM
పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో స్థానిక సుధా కాలనీలోని మహాత్మా జ్యోతిభాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో 7,8,9 తరగతులలో(ఇంగ్లీష్ మీడియం) మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎర్నెస్ట్ సికెపి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని, పూర్తి చేసిన ధరఖాస్తులను ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు సమర్పించాలని తెలిపారు. అలాగే ఈనెల 13వ తేదీన పాఠశాల ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.







