దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

UPDATED 18th DECEMBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి నెల 8,9వ తేదీలలో రెండురోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అంగన్వాడీ వర్కర్స్ యునియన్ పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో సామర్లకోట అర్బన్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు కె. వరలక్ష్మి అధ్యక్షతన మంగళవారం  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు జి. బేబీరాణి హాజరై మాట్లాడుతూ ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్నాయని, ఇందులో భాగంగా ఐసిడిఎస్ బడ్జెట్‌ తగ్గించడం జరిగిందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలు,  కార్పోరేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని ఇటువంటి ఆలోచనలను  తిప్పికొట్టాలని అన్నారు. ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేయడానికే నగదు బదిలీ, మిక్స్‌డ్ ఫుడ్ ప్యాకెట్స్ విధానాలను అమలు చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయని, కేంద్రం పెంచిన అరకొర వేతనాలు  ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని, దీనిని వ్యతిరేకించాలని తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు పనికి తగిన పారితోషికం ఇవ్వాలని, వర్కర్లుకు రూ.18 వేలు ఇవ్వాలని అన్నారు. అలాగే అంగన్వాడీ వర్కర్స్ ను అదనపు పనులకు ఉపయోగించరాదని, అంగన్వాడీ కేంద్రాలను మెర్జ్ చేయడం నిలుపుదల చేయాలని,   అలాగే అర్హులైన సిబ్బందికి  ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షుడు బాలం శ్రీనివాస్, టి. నాగమణి, ఎంబి శ్రీలక్ష్మి, హెచ్.వి. రమణమ్మ, కె. కృష్ణవేణి, వెంకటలక్ష్మి, బాలం లక్ష్మి, సావిత్రి, స్నేహలత, జానకమ్మ, తదితరులు పాల్గొన్నారు..

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us