అధ్వాన్నంగా ఉండూరు-వేమవరం రహదారి

UPDATED 24th MAY 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: మండల పరిధిలోని ఉండూరు, వేమవరం గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గ పరిధిలో గల ఈ రహదారిపై ప్రయాణించడానికి ప్రయాణికులు నానా అగచాట్లు పడుతున్నారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణం కష్టంగా మారింది. ప్రమాదకరమైన గోతులు ఏర్పడటం వాటిలో వర్షపు నీరు నిలిచి ఉండటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఈ రోడ్డుమార్గాన్ని పునర్నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us