UPDATED 11th OCTOBER 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): విద్యార్థులు శాంతిభద్రతలపై అవగాహన పెంచుకుని దేశ రక్షణకు కృషి చేయాలని సామర్లకోట ఎస్ఐ వి.ఎల్.వి.కె. సుమంత్ పేర్కొన్నారు. ఈ నెల 21న అమరవీరుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థులకు శుక్రవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పోలీసుల విధి విధానాలు, ఆయుధాలు వినియోగం, రోడ్డు భద్రత, క్లూస్ టీమ్, డాగ్ స్క్యాడ్ చట్టాలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్నతనం నుంచి దేశ రక్షణ, శాంతిభద్రతల సంరక్షణకు కృషి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు నిబంధనలు పాటించాలని, అలాగే ఇతరులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో లాకప్, తుపాకులను విద్యార్థులకు చూపించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.







