ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

UPDATED 25th JANUARY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: జాతీయ ఓటరు దినోత్సవాన్ని స్థానిక  బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో  శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులచే ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు విలువ, ఓటరు బాధ్యతలను హెచ్ఎం వివరించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పిడి తాళ్లూరి వైకుంఠం, ఉపాధ్యాయులు ఏ.ఎల్.వి. కుమారి, జి. గోవిందు, కె. అరుణ, కెవివి సత్యనారాయణ, రాజేంద్రకుమార్, చంద్రమోహన్, బి శ్రీ లక్ష్మి, శ్రీవల్లి భార్గవి, శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us