నూరుశాతం రాయితీతో ఎలుకల నివారణా మందు పంపిణీ

UPDATED 11th SEPTEMBER 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎలుకల బెడద అధికంగా ఉన్నందున రైతులందరూ  సామూహిక ఎలుకల నిర్మూలనా కార్యక్రమం చేపట్టాలని మండల వ్యవసాయాధికారిణి ఐ. సత్య పేర్కొన్నారు. సామర్లకోట పట్టణ పరిధిలోని జగ్గమ్మగారిపేట, గాంధీబొమ్మ సెంటర్ ఉప్పువారి వీధి, మండల పరిధిలోని వేట్లపాలెం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నూరు శాతం రాయితీపై ఎలుకల నివారణా మందు బ్రోమోడయోలిన్ ను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 96 శాతం నూకలు, రెండు శాతం నూనె, రెండు శాతం బ్రోమోడయోలిన్ మందు మిశ్రమాన్ని కలిపి ఎలుక బొరియలలో ఉంచాలని, దీనివల్ల పూర్తిస్థాయిలో ఎలుకల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో, ఎంపీఈవోలు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us