ఆదిత్యలో డి.ఎస్.పి. టూల్స్ అండ్ అప్లికేషన్స్ పై వర్క్ షాప్

UPDATED 4th JANUARY 2018 THURSDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈనెల నాలుగు, ఐదు తేదీల్లో రెండురోజులు పాటు నిర్వహించే వర్క్ షాప్ గురువారం ఘనంగా ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలకు చెందిన ఈ.సి.ఈ విభాగం, ఐ.ఎస్.టి.ఈ సౌజన్యంతో, ఎన్.ఐ.టి-సూరత్ కి చెందిన డాక్టర్ జ్ఞానేశ్వనాధ్ శతపతి ఆధ్వర్యంలో డి.ఎస్.పి. టూల్స్ అండ్ అప్లికేషన్స్ పేరిట నిర్వహించే ఈ వర్క్ షాప్ లో, కళాశాలకు చెందిన మూడవ, నాల్గవ సంవత్సరం ఈ.సి.ఈ చదువుతున్న విద్యార్థులకు శిక్షణ ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, ఈ.సి.ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్.వి.కృష్ణ, ప్రొఫెసర్ డి.కిషోర్, విద్యార్థులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us