రుణాల మంజూరులో బ్యాంకులు సహకరించాలి

UPDATED 25th JULY 2019 THURSDAY 6:30 PM

పెద్దాపురం: రైతులకు పంట రుణాలు మంజూరులో బ్యాంకులు పూర్తి సహకారం అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె.ఎస్.వి. ప్రసాద్ అన్నారు. మండల పరిధిలో గల కౌలు రైతులు, కిసాస్ క్రెడిట్ కార్డు గల రైతులకు పంట రుణాల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానిక ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజర్లను ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు, ఆహార భద్రత, వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుందని వారికి తెలియజేశారు. రుణాల మంజూరు విషయంలో జిల్లా వ్యవసాయ అధికారులు, మండల అధికారులు, బ్యాంకు మేనేజర్లను మర్యాదపూర్వకంగా కలిసి రైతులకు బాసటగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. మాధవరావు, ఎడిఏ రత్న ప్రశాంతి, ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ డీడీఏ పివిఎస్ నాగాచారి, ఏవో కొల్లి ద్వారకాదేవి, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us