పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 27 ఆక్టోబర్ 2021: యూనియన్లకు అతీతంగా పాత్రికేయుల సంక్షేమానికి పెద్దాపురం ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) సంఘం కృషి చేయాలని పలువురు వక్తలు అన్నారు. స్థానిక ఎమ్మార్సీ భవనంలో ప్రింట్ మీడియా కార్యవర్గం సమావేశం క్లబ్ అధ్యక్షుడు పచ్చిపాల ప్రసాదరావు అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు చల్లా విశ్వనాథం, మొల్లి సూర్యనారాయణ, రాకుర్తి రాంబాబు, నర్లజర్ల వినాయిక్ మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా పాత్రికేయులు సమస్యల పరిష్కారానికి కార్యవర్గం కృషి చేయాలన్నారు. క్లబ్ అధ్యక్షుడు పచ్చిపాల ప్రసాదరావు మాట్లాడుతూ పెద్దాపురం పాత్రికేయులు సమస్యల పరిష్కారం, సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. అనంతరం పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో పెద్దాపురం పాత్రికేయులు చవ్వాకుల ఈశ్వరరావు, పాసిల ప్రసాద్, బొదిరెడ్డి బుజ్జి, రాయవరపు వీరబాబు, ఎన్. శ్రీరామ్, పి.విక్రమ్ శాస్త్రి, బద్ది కుమార్, సిద్ధాంతపు సుబ్బారావు, అప్సర తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







