UPDATED 3rd JANUARY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: జాతీయస్థాయిలో జనవరి 7 నుంచి 17 వ తేదీ వరకు ఒరిస్సాలోని పూరీలో జరగనున్న కోస్టల్ ట్రెక్కింగ్-2019కు మండల పరిధిలో గల నవర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థి గుండ్ర సతీష్ కుమార్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ సత్యవతి తెలిపారు. అలాగే తమ పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థి తోట మహేష్ ఈనెల 9 నుంచి 20 వ తేదీ వరకు గుంటూరులో జరుగు జాతీయ సమైక్యతా శిబిరానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తరఫున ఎంపికనట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సిహెచ్ సత్యవతి, ఎన్.సి.సి అధికారి జివివి సత్యన్నారాయణ, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.







