UPDATED 24th JULY 2020 FRIDAY 5:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): చెవులకు బంగారు కమ్మలు, కాళ్ళకు వెండి పట్టీలతో ఒక కోడిపుంజు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలోని మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అందరి దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెళ్తే రౌతులపూడికి చెందిన భక్తులు కోడి పుంజుకు ఇలా చెవులకు కమ్మలు, కాళ్లకు పట్టీలను అందంగా అలంకరించి మరిడమ్మ అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ విషయంపై దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి మాట్లాడుతూ కోడిపుంజు పౌరుషానికి ప్రతీకని, అలాగే చెవి కమ్మలు, కాళ్ళ పట్టీలు అమ్మవారు శక్తి స్వరూపిణి కారణంగా వీటిని అలంకరించినట్లు ఆమె పేర్కొన్నారు.







