UPDATED 8th APRIL 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ మండలంలోని ఉండూరు, అచ్చంపేట, గొంచాల, నవర, చంద్రంపాలెం, కాపవరం, పెదబ్రహ్మదేవం, మేడపాడు, వేట్లపాలెం గ్రామాలలో ఆదివారం సిపిఎం ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కరణం ప్రసాదరావు, బాలం శ్రీనివాస్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో పదకొండు జాతీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, పదమూడు జిల్లాల్లో ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, ప్రత్యేక హోదా ఇస్తే అనేక పరిశ్రమలు వస్తాయని, ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తెలుగుదేశం, బిజెపి పార్టీలు మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని, ప్రజలు అందరూ ఐక్యంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నీలపాల సూరిబాబు, తుంపాల శ్రీనివాస్, బత్తుల బాలాజీ, మహేష్, పి. వీరబాబు, దారబాని కృష్ణ, దారపురెడ్డి కృష్ణ, డి. సత్యనారాయణ, పవన్, డాన్ శ్రీను, గోపాల్, కోన శ్రీను, కరణం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.







