నాడు నేడు అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఉపాధ్యాయులకు తగదు

గంగవరం: 3 ఆగస్టు 2020 (రెడ్ బీ న్యూస్): ప్రభుత్వం పాఠశాలల్లో కనీస వసతులు కల్పనకు చేపట్టిన నాడు - నేడు అభివృద్ది కార్యక్రమాలు అభినందనియమేనని కానీ ఆ పనుల నుంచి తక్షణమే ప్రధానోపాధ్యాయులను మినహాయించి వేరే ప్రత్యామ్నాయం ద్వారా పనులు చేయించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కె.కృష్ణ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు అలవాటు లేని నిర్మాణ పనుల వలన ఈ కరోనా తీవ్రంగా ప్రబలుతున్న కష్ట కాలంలో మెటీరియల్ తెచ్చుకోలేక, వర్కర్స్ దొరకక, ఉన్నతాధికారుల రోజువారీ టార్గెట్లు చేరుకోలేక, ప్రతిరోజు బిల్స్ ఆన్లైన్ అప్లోడ్ చేయలేక, ఇప్పటికే వచ్చిన మెమోలకు సమాధానం చెప్పలేక ఉన్నతాధికారుల నుంచి ఎక్కడ మెమో వస్తుందేమో అని అనునిత్యం భయపడుతూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి నిదర్శనం నిన్న మండలంలో కుసుమరాయి యువ ప్రధానోపాధ్యాయులు వై.అచ్చిరెడ్డి మరణమేనని యూటీఎఫ్ నాయకులు ఆరోపించారు. ఇటీవలే రాజవొమ్మంగి మండలంలో కూడా ఒక ప్రధానోపాధ్యాయుడు ఇలాంటి మానసిక ఒత్తిడి వల్లే చనిపోయారని, పరిస్థితి మారకపోతే మరిన్ని ఉపాధ్యాయ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని వారు ఆవేదన చేశారు. కాబట్టి తక్షణమే నాడు నేడు పనుల నుండి పూర్తిగా ప్రధానోపాధ్యాయులను మినహాయించి వారికి బోధనకు మాత్రమే పరిమితం చెయ్యాలని వేరే ప్రత్యామ్నాయం ద్వారా ఈ పనులను చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, కుటుంబ సంక్షేమ భాద్యులు బొజ్జి దొర, జిల్లా కౌన్సిలర్ వెంకన్న దొర, కె.రఘు బాబు దొర, కుంజం రాంబాబు దొర, బి.రాంబాబు దొర తదితరులు పాల్గొన్నారు
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us