ఆదిత్య బిజినెస్ స్కూల్లో నోటాపై ప్యానల్ చర్చ

UPDATED 28th DECEMBER 2018 FRIDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో నోటాపై శుక్రవారం ప్యానల్ చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి హాజరై మాట్లాడుతూ నోటాను 2015 సెప్టెంబర్ 18వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం గుర్తించిందని, మనదేశంలో ప్రజా ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారని అన్నారు. ఇవిఎంలలో పోటీ చేసిన అభ్యర్థుల పార్టీ చిహ్నంతో పాటు అభ్యర్థి పేరు కూడా ఉంటుందని, అలాగే ఇవిఎం చివర నోటా బటన్ ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే  ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో నోటాపై వేయవచ్చని న్యాయస్థానం పేర్కొందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ 18  సంవత్సరాలు వయస్సు నిండిన భారతదేశ పౌరులు ఓటు అనే ఆయుధం ద్వారా తమకు నచ్చిన నాయకుణ్ణి ఎన్నుకునే అధికారం రాజ్యాంగం కల్పించిందని అన్నారు. ఈ సందర్భంగా నోటా అంశంపై విద్యార్థులకు చర్చలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా గెలుపొందిన విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా డాక్టర్ దువ్వూరి మెహర్జీ, అధ్యాపకులు, అధ్యాపకేత సిబ్బంది, విద్యార్డునీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులైన ఫైనల్ ఇయర్ బిబిఏ విద్యార్థులు అభిజిత్ సర్కార్, అవినాష్, భరద్వాజ్ లను డాక్టర్ మెహర్జీ దువ్వూరి అభినందించారు.               

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us