రాష్ట్ర బంద్ కు వామపక్షాలు పిలుపు

UPDATED 15th APRIL 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఏప్రిల్ 16న నిర్వహించనున్న బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ, సిపిఐ, సిపిఎం, జనసేన, కాంగ్రెస్ పార్టీలు ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం పార్టీ కార్యకర్తలు పట్టణ వీధుల్లో ఈ ర్యాలీ నిర్వహించి బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెదిరెడ్డి సత్యనారాయణ, ఎలిశెట్టి రామదాసు, కామిరెడ్డి బోడకొండ, పోతుల బాపిరాజు, పిల్లా రఘు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగినీడి భవన్నారాయణ, దువ్వా సత్తిబాబు, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us