అమర జవాన్లకు నివాళి

UPDATED 15th FEBRUARY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: జమ్మూ కాశ్మీర్ లో  ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీరజవాన్లకు నివాళులు అర్పిస్తూ  పట్టణంలో యువత శుక్రవారం శాంతి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి మటన్ సెంటర్, రైల్వే స్టేషన్ మీదుగా కొవ్వొత్తుల ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర జవాన్ల త్యాగాలు భారత జాతి గుర్తుంచుకుంటుందని, తీవ్రవాదుల దుశ్చర్యలను మనమంతా ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలం హరిబాబు, సుకుమార్, మడుగుల శ్యామ్, వాసు, బాలం శ్రీనివాస్, దారబాని కృష్ణ, వెంకట్, కమ్మిళ్ల ఫణి, నాగం రవి, సింహాచలం, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us