UPDATED 27th DECEMBER 2019 FRIDAY 9;00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): పౌరసత్వ సవరణ చట్టాన్ని జాతీయ పౌర పట్టికను నిరసిస్తూ సిపిఎం, సిపిఐ, ముస్లిం సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక మసీదు సెంటరు నుంచి శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దువ్వా శేషు బాబ్జీ మాట్లాడుతూ పౌరసత్వం సవరణ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తన మతతత్వ పూరితమైన ఆలోచనలను ప్రజలపై బలవంతంగా రుద్దుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. ఈ చట్టాలను సత్వరమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘాల ఐక్య వేదిక నాయకులు ఎండి హబీబుల్లా, అబ్దుల్ ఖయ్యూం, అబ్దుల్ రహమాన్, అబ్దుల్ తబాబ్, ఎండి గౌస్ సలీమ్, ఎండి హనీబ్, ఎండి ముక్తర్ అలీ, ఎండి గౌస్, ఎండి సైఫుల్లా మాస్టర్, సయ్యద్ మునాఫ్ భాషా, సిపియం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు, శాఖా కార్యదర్శి బాలం శ్రీనివాస్, సిపిఐ జిల్లా నాయకులు ఆర్. సతీష్, సిపిఐ పట్టణ నాయకులు వెలిశెట్టి రామదాసు, జనసేన జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్టా జానకి రామారావు, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు లింగం శివ ప్రసాద్, సిఐటియు మండల అధ్యక్షులు బర్ల గోపాల్, డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి పవన్‌దాసు, తదితరులు పాల్గొన్నారు.







