గెలిపించండి.. అండగా ఉంటా

UPDATED 25th MARCH 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.. అండగా ఉంటా’ అని పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తోట వాణి నియోజకవర్గ ప్రజలను కోరారు. సార్వత్రిక  ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఆమె తన కుమారుడు తోట రాంజీతో కలిసి సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినీతి, అక్రమాలలో టిడిపి పూర్తిగా మునిగిపోయిందని.. జగనన్న వస్తేనే రాష్ట్ర భవిష్యత్‌ బాగుంటుందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనంతా అరచేతిలో స్వర్గం చూపించినట్లు ఉందని, రైతు పరిపాలన, ప్రజా పరిపాలన రావాలంటే రాజన్నా రాజ్యం రావాలని.. అది జగనన్నతోనే సాధ్యమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గోలి శ్రీరామ్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి తోట వాణి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, దవులూరి సుబ్బారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, పాగా సురేష్ కుమార్, సేపేని సురేష్, కానుబోయిన విజయకృష్ణ, ఆవాల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజేష్, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us