UPDATED 15th NOVEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: 51వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం స్థానిక గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు యు. సత్యనారాయణ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిరకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రదర్శించిన ఈ పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విజ్ఞానవంతులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిడి ఎం. వెంకటేశ్వరరావు, చుండ్రు రామయ్య చౌదరి, డి. లక్ష్మీశిరీష, కృష్ణప్రసాద్, ఇంచార్జ్ లైబ్రేరియన్ ఎస్. బుల్లియ్య, తదితరులు పాల్గొన్నారు.







