UPDATED 23rd JULY 2019 TUESDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఫార్మసీ డైరెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రవిశంకర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, నాటిన మొక్కలు పెరిగేంతవరకు సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీల ద్వారా తెలియజేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కె. వెంకటేశ్వరావు, పర్యావరణమిత్ర అవార్డు గ్రహీత తోటకూర గంగాధర్, ఎన్ఎస్ఎస్ యూనిట్ కోఆర్డినేటర్ ఎ. కార్తీక్, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







