Sonia Gandhi on ‘Bharat Jodo Yatra’: అందుకే నేను కాంగ్రెస్ ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభ సభలో పాల్గొనలేకపోతున్నాను: సోనియా గాంధీ

UPDATED 7th SEPTEMBER 2022 WEDNESDAY 06:25 PM

Sonia Gandhi on ‘Bharat Jodo Yatra’: కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటోన్న విషయం తెలిసిందే. ‘‘వైద్యం నిమిత్తం నేను విదేశాల్లో ఉంటున్న నేపథ్యంలో ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభ సభలో పాల్గొనలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చారిత్రక ‘భారత్ జోడో’ యాత్ర ఇవాళ సాయంత్రం ప్రారంభం కానుంది. ఇది మన మహోన్నత పార్టీకి మైలురాయి వంటిది. దీనితో మన పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us