UPDATED 14th JUNE 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: విద్యార్థి భవిష్యత్తుకు అధ్యాపకులు, తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల 2018-19 విద్యా సంవత్సరం మొదటి సంవత్సరం తరగతులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన విద్యార్థి, తల్లితండ్రుల సమావేశంలో సంస్థ చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్ధి ఉజ్వల భవిష్యత్తుకు ఆదిత్య అవలంబిస్తున్న విధానాలకు విద్యార్థి తల్లితండ్రులు సహకరించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆదిత్య విద్యా సంస్థలపై నమ్మకంతో తమ పిల్లలను తమ కళాశాలలో చేర్చిన విద్యార్థి తల్లితండ్రుల నమ్మకాన్ని వమ్ము కానీయమని, మూడు దశాబ్దాల పైబడి ఆదిత్య విద్యారంగంలో కెజి నుంచి పిజి వరకు రాష్ట్రంలోనే పేరెన్నికగన్న సంస్థగా నిలిచిందని అన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ రంగంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న నమ్మకమైన సంస్థ ఆదిత్య అని, అందుకు ఆదిత్య గత సంవత్సరంలో సాధించిన ఫలితాలు గమనిస్తే అర్ధమౌతుందని అనుభవజ్ఞులైన సిబ్బంది శిక్షణతో పూర్తి స్థాయి సదుపాయాలతో మెరుగైన విద్యను అందించడంలో తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. అనంతరం హైదరాబాదుకు చెందిన మనోవికాస నిపుణులు సతీష్ మాకెన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థి తల్లితండ్రులు, పాల్గొన్నారు.







