రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు క్రీడాకారులు ఎంపిక

UPDATED 29th MARCH 2018 THURSDAY 10:00 PM

సామర్లకోట: పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొనే జిల్లా జట్టుకు క్రీడాకారులను గురువారం ఎంపిక చేశారు. రాష్ట్ర కబడ్డీ కోచ్ పోతుల వీరవెంకట సాయిప్రసాద్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి అనంతరం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 45 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభ కనబరిచారు. డి.ఎస్.డి.వో సయ్యద్ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు భోగిళ్ళ మురళీకుమార్, అంబేద్కర్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు ఊబా కెనడీ, సీనియర్ జాతీయ క్రీడాకారులు కె. శ్రీనివాసు, పిఈటీలు తాళ్ళూరి వైకుంఠం, శ్వేతారాణి, కృపావతి, ఎం.డి.వి. ప్రసాద్ పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us