UPDATED 24th JANUARY 2020 FRIDAY 8:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): అర్హులైన నిరుపేద ప్రజలకు గృహాలు పంపిణీ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఈ పథకానికి ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. పెద్దాపురం-సామర్లకోట ప్రధాన రహదారిలో అధికారులు సేకరించిన నీటి పారుదల శాఖకు చెందిన స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అర్హత ఉండి గృహాలు లేని ప్రతీ ఒక్కరికీ న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, ఉగాది పండుగ నాటికి ఇళ్ళ స్థలాల పంపిణీకి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రాయి ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.







