మొక్కలు పెంపకాన్ని ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి

* కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు

UPDATED 11th MARCH 2020 WEDNESDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): మొక్కలు పెంపకాన్ని ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు అన్నారు. పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ సేవా శిబిరంలో భాగంగా బుధవారం చేపట్టిన వనం-మనం కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, ప్రతీ వ్యక్తి తమ జీవిత కాలంలో 10 మొక్కలు నాటాలని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల నివారణకు చెట్లే బ్రహ్మాస్త్రాలుగా పని చేస్తాయని, ప్రతీ విద్యార్థీ తన పుట్టిన రోజు సందర్భంగా ఓ మొక్క నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన సూచించారు. అనంతరం కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. అలాగే తిరుపతి, దివిలి, చంద్రమాంపల్లి గ్రామాల్లో ఇంటింటా పర్యటించి మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ కుమార్, బిఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ సోమశేఖర్, ఈవో  జెన్నిబాబు, ఏవో కెఆర్ సందీప్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎం. సత్తిబాబు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us