UPDATED 10th OCTOBER 2018 WEDNESDAY 7:00 PM
పెద్దాపురం: స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ వరకు సి.బి.యస్.సి సౌత్ జోన్ బాలికల హ్యండ్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల సివోవో కె. శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పోటీలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభిస్తారని, ముగింపు ఉత్సవాలకు కాకినాడ పార్లమెంటు సభ్యులు తోట నరసింహం హాజరవుతారని తెలిపారు. ఐదు రోజులపాటు జరుగు ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ నుంచి సుమారు 750 విద్యార్థినులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ లైజన్ ఆఫీసర్ ఎం. సతీష్, తదితరులు పాల్గొన్నారు.







