UPDATED 11th JULY 2018 WEDNESDAY 8:00 PM
రాజానగరం: కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ కె. లక్ష్మారెడ్డి జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన సతీమణి, లెనోరా విద్యా సంస్థల చైర్ పర్సన్ కె. నాగమణి ఆదేశాల మేరకు బుధవారం వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా మండల పరిధిలోని ఫల్ల కడియం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు కుర్చీలను బహూకరించారు. అనంతరం విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి దంత సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి విద్యార్థులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి, చిన్న పిల్లల దంత వైద్య విభాగాధిపతి వి.వి.రావు, డాక్టర్ పునీత, డాక్టర్ సత్యం, ఎవో అనురాధ, పిఆర్వో కుమార్, పాఠశాల హెచ్ఎం భూలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







