కోవిడ్ వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

* రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు

UPDATED 20th JULY 2020 MONDAY 7:30 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): జిల్లాలో కోవిడ్ వ్యాధి ప్రబలకుండా వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. సోమవారం జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి, జాయింట్ కలక్టర్(డి) కీర్తి చేకూరి, జాయింట్ కలక్టర్ (డబ్ల్యూ) జి. రాజకుమారి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ కిషోర్ లతో జూమ్ యాప్ ద్వారా ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి కన్నబాబు జిల్లావ్యాప్తంగా ఉన్న కోవిడ్ కేసుల వివరాలు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కోవిడ్ బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు గురించి కలక్టరును ఆయన అడిగి తెలుసుకున్నారు.  

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us