UPDATED 7th NOVEMBER 2020 SATURDAY 8:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం జనవరి నెల నుంచి ఇంటింటికీ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసే ప్రక్రియపై టీములు ఏర్పాటు చేసుకోవాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు సంబంధిత అధికారులు సూచించారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో గల అధికారులు, వాలంటీర్లుతో స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జనవరి నుంచి రేషన్ సరుకులను ఇంటింటికి వాహనం ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ నెల పదిహేను రోజులు వాలంటీర్ల ద్వారా జియో ట్యాగింగ్ చేయించాలని, అలాగే ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను సంబంధిత అధికారులు అవగాహన చేసుకుని సమన్వయంతో పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. అలాగే భూరీసర్వేకు సంబంధించిన వివిధ అంశాలను అధికారులకు ఆర్డీవో సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం తహసీల్దార్ బూసి శ్రీదేవి, ఆర్ఐ గౌసియా బేగం, ఏఎస్ఓ కెవివిఎస్ ప్రసాద్, ఈవోపీఆర్డీ కరక హిమ మహేశ్వరి, ఎంఎస్ఓలు కృష్ణ, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.







