జీసస్ జననం సర్వ మానవాళికి నవోదయం

UPDATED 25th DECEMBER 2018 TUESDAY 9:00 PM

గండేపల్లి: జీసస్ జననం సర్వ మానవాళికి నవోదయమని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల చర్చిలో  క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని హాస్టల్ విద్యార్థులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వలోకాన్ని రక్షించడానికి ఏసుక్రీస్తు జన్మించాడని, మనిషి సహాయ గుణాన్ని కలిగి ఉండి, ఆపదలో ఉన్నవారిని మానవతా దృక్పథంతో ఆదుకోవడమే ధర్మంగా భావించాలని అన్నారు. భువిపై ధర్మానికి ప్రతిరూపంగా మానవ రూపంలో అవతరించిన దైవం జీసస్ అని, ప్రేమమయుడైన ఆయన జన్మించిన రోజు సమస్త మానవాళికి పవిత్రమైన రోజు అని తెలిపారు. కరుణ, జాలి, దయ, శాంతి లాంటి సుగుణాల ప్రభావాన్ని, ప్రాధాన్యతను సమాజానికి చూపించిన తేజోమూర్తని, అందుకే ఆయన్ని విశ్వదూతగా పిలుస్తారని పేర్కొన్నారు. అనంతరం ఆనందోత్సాహాల నడుమ కేకు కోసి అందరికీ పంచారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 
 
.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us