ఆదిత్య విద్యార్థినికి వెబ్ డిజైనింగ్ లో ప్రథమ బహుమతి

UPDATED 6th MARCH 2018 TUESDAY 5:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల తృతీయ సంవత్సరం ఐ.టి. విద్యార్థిని సి.హెచ్.ప్రశాంతి వెబ్ డిజైనింగ్ లో ప్రథమ బహుమతి సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవల నిర్వహించిన వెబ్ డిజైనింగ్ పోటీలలో తమ కళాశాల విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమస్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్  వి.శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, విభాగాధిపతి ఎం.రాజబాబు, అధ్యాపక బృందం విద్యార్థినిని అభినందించారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us