ప్రీస్కూల్ చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు

UPDATED 30th JULY 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: అంగన్వాడీ కేంద్రాల్లో గల ప్రీస్కూల్ చిన్నారులకు ప్రతీ నెలా ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని వైద్యులు డాక్టర్ అరుణ, డాక్టర్ ప్రియాంక అన్నారు. స్థానిక బ్రౌన్ పేట సెక్టార్ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రంలోని  చిన్నారులకు మంగళవారం ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ ప్రియాంక, డాక్టర్ అరుణ మాట్లాడుతూ ప్రీస్కూల్ చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తరచూ ఏర్పడతాయని, భవిష్యత్తులో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రతీ నెలా తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. చిన్నారుల్లో వచ్చే శారీరక, మానసిక మార్పులు గుర్తించడానికి, లోపాలను సరిదిద్దడానికి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరని పేర్కొన్నారు. ఈ విషయమై చిన్నారుల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకునే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త బి.శ్యామలాదేవి, సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us