* పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు
UPDATED 22nd JULY 2020 WEDNESDAY 6:30 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): గ్రామాలను పచ్చతోరణంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న పచ్చతోరణం-వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని జి. రాగంపేట, వడ్లమూరు హౌసింగ్ లేఅవుట్లలో మండల అధికారులతో కలిసి బుధవారం ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ కాలుష్య నివారణ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను పచ్చని చెట్లతో నింపాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మానవ జీవనానికి ప్రాణవాయువు అందించే చెట్లను ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించి ప్రతీ ఇంటివద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడంతో పాటు వాటి సంరక్షణ భాద్యతలు కూడా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, తహసీల్దార్ బూసి శ్రీదేవి, ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, ఎన్ఆర్ఇజిఎస్ ఇసి రాజేష్, హౌసింగ్ ఎఈ శ్రీరామచంద్రమూర్తి, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.







