నృత్యకారుడు ప్రసాద్ కు భారత్ టాలెంట్ వరల్డ్ రికార్డ్

UPDATED 3rd JANUARY 2020 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు అలమండ ప్రసాద్ ప్రతిష్టాత్మకమైన భారత్ టాలెంట్ వరల్డ్ రికార్డ్స్ పురస్కారం త్వరలో అందుకోనున్నారు. ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తూ వరల్డ్ రికార్డ్స్ ఎడిటర్ సిహెచ్ మోహిత కృష్ణ లేఖ పంపినట్లు ప్రసాద్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు విభాగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తులను గుర్తించి ఈ పురస్కారాలు అందచేస్తున్నట్లు ఎడిటర్ లేఖలో పేర్కొన్నారన్నారు. తనను ఈ పురస్కారానికి ఎంపిక చేయడంపట్ల ఎంతో ఆనందంగా ఉందని ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా నృత్యకారుడు ప్రసాద్ ను పలువురు అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us