UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 8:00 PM
సామర్లకోట: సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధిలోని అనపర్తి సమీపంలో ఒక వ్యక్తి వేగంగా వెళుతున్న రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 65 సంవత్సరాలు ఉంటుందని, తెల్లని జుట్టు, తెలుపు రంగు పంచి, తెలుపు రంగు ఖద్దర్ లాల్చి ధరించి ఉన్నాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ టి. విజయ్ కుమార్ తెలిపారు.







