UPDATED 24th MAY 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట: కార్మికుల కుటుంబాలకు సీఐటీయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రిక్షా కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చెప్పుల నూకరాజు, కరక మాణిక్యం పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన రిక్షా కార్మిక సంఘం సభ్యులు సిరికి అప్పారావు, ఏడిద నల్లబ్బాయి కుటుంబాలకు సీఐటీయూ ఆర్థిక సాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో బాలం శ్రీనివాస్, తుంపాల శ్రీనివాస్, ఎం. నాగరాజు, పలివెల రాజు, ఎస్. రాజు, తదితరులు పాల్గొన్నారు.







