పాటల పోటీలో సుష్మితకు ప్రథమ బహుమతి

UPDATED 21st JANUARY 2020 TUESDAY 6:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): కృష్ణాజిల్లా తేలప్రోలు ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి సాంస్కృతిక పోటీల్లో పాటల పోటీ విభాగంలో గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని వై. సోనీ సుష్మిత ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి గెలుపొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువుచున్న సోనీ సుష్మిత తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో పాటు పార్సీ  భాషల్లో సైతం పాటలు పాడటంలో ప్రావీణ్యం ఉందని అన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన ఆమెకు జ్ఞాపిక, ప్రశంసా పత్రం లభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డీన్ డాక్టర్ టి. నరేంద్రుడు, ఇసిఇ విభాగాధిపతి వి. సత్యనారాయణ, తదితరులు సుష్మితను అభినందించారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us