ఆదిత్యలో అధ్యాపక అభివృద్ధి శిక్షణ

UPDATED 3rd NOVEMBER 2018 SATURDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గల ఆదిత్య టెక్నికల్ హబ్ విభాగం ఆధ్వర్యంలో ఆదిత్య ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ అధ్యాపక సిబ్బందికి ఫాకల్టీ డవలప్ మెంట్ కార్యక్రమం నిర్వహించినట్లు  టెక్నికల్ హబ్ సిఇవో బాబ్జి నీలం తెలిపారు. వెబ్ డిజైనింగ్ లో గల నూతన విధానాలపై వెబ్ డిజైన్ నిపుణులు సుధీర్, సందీప్ వివిధ ఆన్ లైన్ కోడింగ్ ప్లాట్ ఫామ్ విధానాలు గురించి 33మంది ఇంజనీరింగ్ అధ్యాపక సిబ్బందికి శిక్షణ ఇచ్చారని, సిస్కో సాంకేతిక నిపుణులు షైపు జమ, వీరబాబు, అశోక్ లు 11మంది పాలిటెక్నిక్ సిబ్బందికి సిస్కో ఐటి ఎసెన్షియల్ పై అవగాహన కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్  మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.వి.కె.టి. కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్,  పాలిటెక్నిక్ అధ్యాపక సిబ్బందికి ఆధునిక టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం పట్ల ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, ఆదిత్య టెక్నికల్ హబ్ టీం సభ్యులను అభినందించారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us