గొప్ప మానవతావాది వరప్రసాదరావు

UPDATED 22nd OCTOBER 2018 MONDAY 6:30 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) అటానమస్ కళాశాల అకడమిక్ డీన్ డాక్టర్ ఎం. వరప్రసాదరావు సంతాప సభ సోమవారం గైట్ కళాశాలలో జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణరాజు (చైతన్య రాజు) పాల్గొని మాట్లాడుతూ డీన్ వరప్రసాదరావు గొప్ప మానవతావాది అని, మనసున్న మంచి మనిషని, విధి నిర్వహణలో అంకితభావం గల ఆయన  మృతి కళాశాలకు తీరని లోటు అని అన్నారు. మరణానంతరం ఆయన అవయవాలను దానం చేసి వారి కుటుంబం ఎంతో ఆదర్శంగా నిలిచిందన్నారు. తీవ్ర దుఃఖసాగరంలో మునిగిన వరప్రసాద్ కుటుంబానికి సంస్థ వెన్నుదన్నుగా నిలుస్తుందని చైతన్యరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు, డీన్ వరప్రసాదరావుకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. తొలుత దివంగత డీన్ వరప్రసాద్ చిత్రపటానికి చైర్మన్ చైతన్యరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, ఆయన ఆత్మశాంతికై కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, డాక్టర్ ఎం.డి. ధనరాజు, డాక్టర్ పి.జి. రామానుజం, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, మెకానికల్ విభాగాధిపతి కె. సుబ్బారావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.             

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us