పింఛన్ పెంచిన ఘనత వైసీపీదే

గంగవరం (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022: ఎన్నికల హామీలను నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జెడ్పిటిసి సభ్యురాలు బేబీరత్నం ఎంపీపీ కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మోహనాపురం సచివాలయంలో పెంచిన కొత్త పింఛన్లను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వైయస్సార్ ఆసరా పథకం కింద రూ.2500 పెన్షన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. మోహనాపురం ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను వారు తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం సిద్ధం చేసిన వంటకాలను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సదుపాయాల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు.. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి, సర్పంచులు అక్కమ్మ, తమన్నదొర, ప్రధానోపాధ్యాయుడు బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us